Advertisement

కాశ్మీర్ అంశంపై ఐఓసీ వ్యాఖ్యలను తప్పుపట్టిన భారతదేశం

మన పత్రిక: కాశ్మీర్ అంశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) జోక్యం చేసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశం తీవ్రంగా తప్పుపట్టింది. భౌగోళిక ప్రాంతంతో గానీ, అంతర్జాతీయ శాంతి భద్రతలతో గానీ సంబంధం లేని అంతర్-ప్రాంతీయ కూటములు ఇలాంటి వివాదాల్లో తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Kashmir Issue కి సంబంధించి పాకిస్తాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ మాట్లాడిన సందర్భంలో హరీష్ స్పందిస్తూ, ప్రాంతీయ నాలెడ్జ్ లేని కూటములకు వివాదాలను పరిష్కరించే సామర్థ్యం ఉండదని పేర్కొన్నారు. పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఈ వ్యాఖ్యలు OIC ని ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది. 57 దేశాలతో కూడిన ఈ కూటమి గతంలోనూ పలుమార్లు జమ్మూ కాశ్మీర్ అంశంపై ప్రకటనలు చేసింది.

Advertisement
Advertisement