Advertisement

26 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

మన పత్రిక, న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక వేత్త Sonam Wangchuk జులై 24 శుక్రవారం నాడు తన దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, వైద్యులు, కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారుల సమక్షంలో ఆయన ద్రవాహారం తీసుకుని దీక్షను ముగించారు.

లేహ్ లడఖ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో పాటు దేశంలో శాంతిభద్రతల దృష్ట్యా దీక్ష విరమించాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది పార్లమెంట్ సభ్యులు విజ్ఞప్తి చేశారని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. పలు నిబంధనలపై సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాతే దీక్ష విరమించినట్లు వెల్లడించారు. ఆ నిబంధనలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రత్యేక వీడియో ద్వారా వివరిస్తానని, ప్రజలందరూ ఎలాంటి హింసకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement