Advertisement

తెలంగాణ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ దృష్ట్యా జులై 24న జరగాల్సిన అన్ని పరీక్షలను Osmania University వాయిదా వేసింది. వివిధ విభాగాల పరిధిలో నిర్వహించాల్సిన ఈ పరీక్షల వాయిదాపై అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు మరియు విద్యార్థులు గమనించాలని సూచించింది. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన కొత్త టైమ్‌టేబుల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం స్పష్టం చేసింది.

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా, అలాగే కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ ఎన్ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు తదితర విద్యార్థి సంఘాలు జులై 24న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement