Advertisement

ఏపీ అస్త్రం యాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మన పత్రిక, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అస్త్రం (AP Astram) మొబైల్ యాప్‌ను విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలో నిర్వహించిన ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సులో పాల్గొన్న ఆయన, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఆధునీకరించాలని సీఎం సూచించారు. పోలీసుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ, రతన్ టాటా హబ్ మరియు విట్ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

Advertisement
Advertisement