Advertisement

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రుల బృందం

మన పత్రిక: భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది.

ప్రధాని మోదీ రాక సందర్భంగా విద్యార్థినులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు.

Advertisement
Advertisement