Advertisement

అమరావతిలో పీఎన్‌బీ క్వాంటం హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

మన పత్రిక, అమరావతి: రాజధాని అమరావతిలో PNB Quantum Hub పేరిట క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దేశంలోనే ఇలాంటి ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేస్తున్న మొదటి బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది.

బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక మోసాలను నివారించడమే లక్ష్యంగా ఈ క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యతను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకు ప్రతినిధులకు సూచించారు.

Advertisement
Advertisement