Advertisement

తెలంగాణలో అదనంగా ధాన్యం సేకరించనున్న కేంద్ర ప్రభుత్వం

మన పత్రిక: తెలంగాణలోని రైతన్నలకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.

కేంద్రమంత్రుల హర్షం

తెలంగాణ నుండి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల మేలు కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించిందని వారు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

Advertisement

పెరిగిన సేకరణ లక్ష్యం

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26లో భాగంగా, మొదట 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. అయితే, రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థన మేరకు, కేంద్ర ప్రభుత్వం ఈ సేకరణ లక్ష్యాన్ని 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Advertisement