మన పత్రిక: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఆందోళనలో విద్యార్థులతో పాటు పలు రాజకీయ పార్టీలు పాల్గొని తమ మద్దతును తెలుపుతున్నాయి. నిరసనకారులు రాత్రింబవళ్లు ఆందోళన కొనసాగిస్తుండటంతో, వారికి సహాయం చేసేందుకు గుర్తు తెలియని దాతలు ముందుకు వస్తున్నారు.
దాతలు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా నిరసన స్థలానికి భారీగా ఆహారాన్ని, నీటిని పంపిస్తున్నారు. నిరసనకారుల అవసరానికి మించి ఆహార పదార్థాలు అందుతున్నాయని సమాచారం. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమవుతోంది. సోనమ్ వాంగ్ చుక్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వెళ్లి చర్చలకు సిద్ధమని తెలిపారు. అయితే, నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
