మన పత్రిక: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తప్ప మరెక్కడా సమావేశం కావాలని తాము పిలుపునివ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపినట్టు సమాచారం ఉందని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. వారితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఎవరైనా నిరసనలో పాల్గొనాలంటే జంతర్ మంతర్ వద్దకు రావాలని ఆయన కోరారు. తాము దేశభక్తులమని, ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసన చేపడతామని ఆయన చెప్పారు.
శాంతియుత నిరసనలకే ప్రాధాన్యం
నిన్న లాఠీ ఛార్జ్ జరిగినప్పటికీ విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడలేదని అభిజిత్ దీప్కే అన్నారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారికి పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్షతో ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.