Advertisement

గుజరాత్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

మన పత్రిక, ఆనంద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సురేష్ పర్మార్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. వాసద్ రైల్వే స్టేషన్ వద్ద నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు పాపను రైలు పట్టాలపై పడేశాడు. ఆ సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పోలీసులపై దాడి మరియు ఎన్‌కౌంటర్

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు సురేష్ పర్మార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని వాహనంలో తరలిస్తుండగా, వాంతులు అవుతున్నాయని చెప్పి వాహనాన్ని ఆపించాడు. వ్యాన్ ఆగగానే, తన వద్ద ఉన్న కత్తితో పోలీసులపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ రాణా హెచ్చరించినా నిందితుడు వినకుండా దాడిని కొనసాగించడంతో, ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు.

Advertisement
Advertisement