Advertisement

Andhra News: చంద్రబాబు భద్రతకు కొత్త హెలికాప్టర్

Advertisement

Chandrababu naidu new helicopter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhrapradesh Government ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గత రెండు వారాలుగా సీఎం జిల్లాల పర్యటనలకు ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. పాత బెల్ హెలికాప్టర్ కు బదులుగా ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ ను ఎంపిక చేశారు. ఈ హెలికాప్టర్ అధునాతన ఫీచర్లతో కూడినది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇందులో పైలట్లతో పాటు ఆరుగురు ప్రయాణించవచ్చు. ఇది సమయం, ఆర్థిక వనరుల రెండింటినీ ఆదా చేస్తుంది.

Advertisement

ఇంతకు ముందు సీఎం ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గమ్యానికి చేరుకునేవారు. ఇప్పుడు నేరుగా హెలికాప్టర్ లో జిల్లాలకు వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత సీఎం పర్యటనలపై ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త హెలికాప్టర్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement