Advertisement

ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు: టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

మన పత్రిక: ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో పార్లమెంట్ వేదికగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను బలంగా ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం మరియు రైల్వే జోన్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి గరిష్టంగా నిధులు సాధించడమే లక్ష్యంగా ఎంపీలు పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement