Advertisement

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీసుల కేసు నమోదు

మన పత్రిక, కిర్లంపూడి: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు.

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, వారి కుటుంబ సభ్యులు దానిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్నప్పుడు అంబటి రాంబాబు మరియు వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో తమను నెట్టివేసి విధులకు ఆటంకం కలిగించారని ఏఆర్ ఎస్సై అప్పలరాజు, కానిస్టేబుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

పోలీసుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై BNS 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అంత్యక్రియల సమయంలో ఆందోళనకర పరిస్థితులకు దారితీసింది.

Advertisement