మన పత్రిక, నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మామురా గ్రామంలోని ఒక నివాస భవనంలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ భారీ శబ్దంతో పేలడంతో మంటలు ఇతర వాహనాలకు, భవనానికి వ్యాపించాయి. ఈ ప్రమాదం వల్ల వెలువడిన దట్టమైన పొగ మెట్ల మార్గం గుండా పై అంతస్తులకు విస్తరించడంతో, పొగ పీల్చిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
50 కుటుంబాల రక్షణ
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న సుమారు 50 కుటుంబాలను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శిలాతోరణం వరకు క్యూలైన్లు
- మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: చంద్రబాబు
- హుస్సేన్ సాగర్ ప్రాజెక్టులో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టు ఊరట
- పోక్సో నిందితుడికి బెయిల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ విమర్శ
- అనకాపల్లిలో ‘అభయ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనిత
