Advertisement

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

మన పత్రిక: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఫార్చూన్-500 కంపెనీలను ఆయన ఆహ్వానించారు.

2034 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, విద్యుత్ బస్సుల వినియోగం మరియు మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు అందించిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement
Advertisement