మన పత్రిక: షియోమీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Redmi Note 17ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ మరియు Qualcomm స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
డిస్ప్లే మరియు పనితీరు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7 అంగుళాల FHD+ OLED డిస్ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. 4nm టెక్నాలజీతో రూపొందిన స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌కు సహకరిస్తుంది. ఫోన్లో 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ మరియు ప్రత్యేక ఫీచర్లు
Redmi Note 17లో ప్రధాన ఆకర్షణగా 8000mAh బ్యాటరీని అందించారు. ఇది రెండు రోజుల బ్యాకప్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, దీని ద్వారా ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ OS 3తో పనిచేసే ఈ ఫోన్లో AI ఆధారిత యాంటీ-ఫ్రాడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఇది డీప్‌ఫేక్ వీడియో కాల్స్, స్కామ్ కాల్స్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.
ధర వివరాలు
చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ప్రారంభ ధర 6GB+128GB వేరియంట్‌కు 1,299 యువాన్లు (సుమారు రూ. 18,425)గా ఉంది. భారత్‌లో విడుదలపై సంస్థ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
