Advertisement

సెప్టెంబర్ 11న విడుదల కానున్న ఫహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don’t Trouble The Trouble). ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కొత్త తరహా ఫాంటసీ డ్రామా (Fantasy Drama) అంశాలతో తెరకెక్కినట్లు దర్శకుడు తెలిపారు. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫహద్ ఫాజిల్ తొలిసారిగా తెలుగులో నేరుగా ఒక చిత్రంలో నటిస్తుండటం విశేషం.

Advertisement
Advertisement