Advertisement

రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

మన పత్రిక, పోలవరం: పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ రాబోయే మూడేళ్ల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పనుల కోసం మొత్తం 35,313 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు వెల్లడించారు.

జలధార పనుల కోసం ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 1023 సాగునీటి పథకాల పునరుద్ధరణ బాధ్యతలను ఏపీఎస్ఐడీసీ (APSIDC) సంస్థకు అప్పగించారు. సాగునీటి రంగంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి, రైతులకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement