మన పత్రిక, ఏపీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి డెల్టా రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్ల మార్పిడి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.152.95 కోట్ల వ్యయంతో మొత్తం 117 గేట్ల ఆధునికీకరణ (Modernization) పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల ద్వారా బ్యారేజీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు నీటి నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొననున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడి దారుణ చర్యల వెల్లడి
- ఢిల్లీ యమునా నదిలో నలుగురు బాలురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
- భారత మార్కెట్లోకి లావా విరాట్ V1 సిరీస్ స్మార్ట్ఫోన్లు
- పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స: ఆరోగ్యంపై స్పందించిన అన్నా కొణిదెల
- బీఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: రూ. 259కే 700GB డేటా, ఉచిత OTT
