మన పత్రిక, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్థులు జెట్టక్కను ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టారు. వర్షాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ వింత ఆచారాన్ని నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ గండి నారాయణ తెలిపారు.
గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల సభ్యులు కలిసి ఇంట్లోని పాత వస్తువులు, బట్టలు, చీపురు కట్టలను సేకరించారు. డప్పుల మోతలతో ఊరేగింపుగా ఆ వస్తువులను గ్రామ శివారు వరకు తరలించి పడేశారు. దరిద్ర దేవతగా భావించే జెట్టక్కను పంపడం ద్వారా లక్ష్మీదేవి (Lakshmidevi) గ్రామంలోకి వస్తుందని వారు నమ్ముతున్నారు. పంటలు పండాలని కోరుతూ భవిష్యత్తులో కప్పతల్లి ఆట, వరుణ యాగం కూడా నిర్వహించనున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- పవన్ కల్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స
- ధ్రువయోగంతో ఐదు రాశుల వారికి అదృష్టం
- లెనిన్ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరిని సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- విశాఖలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి భావోద్వేగం
