Advertisement

మార్కాపురంలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పనులపై కలెక్టర్ అసంతృప్తి

మన పత్రిక, మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ఎన్యుమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా పరిశీలించారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో డిజిటలైజేషన్ పనుల పురోగతిని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు.

ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని గమనించిన కలెక్టర్, అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, వెంటనే డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement