Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

మన పత్రిక, హైదరాబాద్: ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో విమానయాన సేవలను విస్తరించడంపై ఇరువురు కీలక చర్చలు జరిపారు. రాష్ట్రానికి ఎమిరేట్స్ విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి కోరగా, సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానమైన ఏ-380 (A-380) సర్వీసులను హైదరాబాద్‌కు నడిపేందుకు ఆసక్తి చూపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీకి (Sports University) స్పాన్సర్‌షిప్ అందించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు రానున్న నేపథ్యంలో ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ఎంతో కీలకంగా మారనుంది.

Advertisement