Advertisement

వియత్నాం బోటు ప్రమాదంలో మచిలీపట్నం మహిళ మృతి

మన పత్రిక, మచిలీపట్నం: వియత్నాంలో జరిగిన ఘోర స్పీడ్‌బోట్ ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వ్యాపారవేత్త భార్య గేల్లి జయశ్రీ మరణించారు. విహారయాత్ర (Foreign Trip) కోసం భర్త గేల్లి కిషోర్‌తో కలిసి ఆమె వియత్నాం వెళ్లారు. శనివారం ఉదయం ఫు క్వాక్ ద్వీపంలోని హోన్ మే రుట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోటు సముద్రపు అలల ఉద్ధృతికి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 14 మంది పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. మొబైల్ సంస్థ ఏర్పాటు చేసిన పర్యటనలో భాగంగా వీరు విదేశీ ప్రయాణం చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు బాధితుల వివరాలను సేకరిస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement