మన పత్రిక, సిద్దిపేట: తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో రూపుదిద్దుకుంటోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ వంతెనను హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేయడం దీని ప్రత్యేకత.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో రూ.4.22 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్లాస్ బ్రిడ్జితో పాటు చెరువు పరిసరాలను పూర్తిస్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, గార్డెన్లు, ప్రత్యేక లైటింగ్, సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, మరో రెండు మూడు నెలల్లో సాంకేతిక, భద్రతాపరమైన తనిఖీలను పూర్తి చేసి అధికారికంగా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణం జరుగుతుండగానే దీనిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
- సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు.. డెలివరీ బాయ్ అరెస్ట్
