Advertisement

బండి భగీరథ్ పోక్సో కేసు.. నేడు కోర్టులో కస్టడీ పిటిషన్

మన పత్రిక, మల్కాజ్‌గిరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో బండి భగీరథ్‌ను ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు మంగళవారం మల్కాజ్‌గిరి పోక్సో కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

బండి భగీరథ్ కేసు హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు త్వరగా దర్యాప్తు ముగించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా భగీరథ్ స్నేహితులను పోలీసులు ఇప్పటికే స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. భగీరథ్ కేసులో నేడు కస్టడీ పిటిషన్ దాఖలు కానుంది.

Advertisement
Advertisement