Advertisement

టీజీ ఈసెట్ 2026 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్, వివరాలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థుల కోసం నిర్వహించే టీజీ ఈసెట్-2026 హాల్ టికెట్లను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 15వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.

విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన 80 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 18,637 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి.

Advertisement

కాగా, ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి రూ.10,000 భారీ ఆలస్య రుసుముతో మే 11, 12 తేదీల వరకు అప్లై చేసుకునేందుకు అధికారులు చివరి అవకాశం కల్పించారు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఈసెట్ -2026 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

Advertisement