మన పత్రిక , కలకత్తా: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఓటమి పాలు కాగా, బీజేపీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీ, ఒడిశా, బీహార్ రాష్ట్రాల తర్వాత ఇప్పుడు బెంగాల్ ఫలితాలతో ఉత్తర భారతదేశం అత్యధికంగా బీజేపీ చేతుల్లోకి వెళ్లినట్లయింది.
ఓట్ల కోసం బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను చేరదీసి స్థానిక జనాభా సమీకరణాలను మార్చడం, సిలిగురి కారిడార్‌ను సున్నిత ప్రాంతంగా మార్చడం టీఎంసీ పరాజయానికి ప్రధాన కారణాలు. సీబీఐ, ఈడీ సంస్థలను రాష్ట్రంలోకి రానివ్వకపోవడం, స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నేతలను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. దీనికి తోడు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆర్థిక వ్యవహారాలు కూడా పార్టీని దెబ్బతీశాయి.
ఈ పరిణామాలతో బెంగాల్‌లో హిందూ ఓటు ఏకతాటిపైకి వచ్చింది. సీఈసీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో మమతకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీఎంసీ శ్రేణులను నియంత్రించి చాలా జాగ్రత్తగా పాలన సాగించాల్సి ఉందని స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి :
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
