AutoRABIT హైదరాబాద్ లో ఫ్రెషర్స్ కోసం ఆకర్షణీయమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ పోస్టులకు BE, BTech, MTech, MCA అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఐటీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి.
ఈ ఇంటర్న్‌షిప్ మొత్తం 6 నెలలు (జూన్ 1, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు) కొనసాగుతుంది. హైదరాబాద్‌లో హైబ్రిడ్ మోడ్‌లో పని చేసే అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా, ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹65,000 స్టైపెండ్ (మొత్తం ₹4 లక్షలు) ఇవ్వడం ఈ అవకాశాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.
ఇంటర్న్‌గా ఎంపికైన వారు Java, Spring Boot, React వంటి ఆధునిక టెక్నాలజీలతో పని చేస్తూ బ్యాక్‌ఎండ్, ఫ్రంట్‌ఎండ్ డెవలప్‌మెంట్‌లో హ్యాండ్స్-ఆన్ అనుభవం పొందుతారు. కోడ్ రివ్యూస్, డీబగ్గింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌పై పని చేసే అవకాశంతో పాటు, Git వంటి టూల్స్‌తో టీమ్ కోలాబరేషన్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగాల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. Java, React, డేటా స్ట్రక్చర్స్ వంటి బేసిక్ నాలెడ్జ్ ఉండటం ప్లస్ పాయింట్‌గా ఉంటుంది.
ముఖ్యంగా, ఈ ఇంటర్న్‌షిప్‌లో మెరుగైన పనితీరు కనబరిచిన వారికి ఫుల్‌టైమ్ జాబ్ ఆఫర్ కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. కాబట్టి IT రంగంలో మంచి ప్రారంభం కోసం చూస్తున్న యువతకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. ఈ జాబ్ కోసం మరిన్ని వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి.
Apply Link: https://tinyurl.com/48an723z
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
