Advertisement

Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?

ఢిల్లీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకంగా ఉన్న రాజ్యసభ ఎంపీల బృందాన్ని చీల్చి, మెజారిటీ సభ్యులతో బీజేపీ వైపు మళ్లించిన రాఘవ్ చడ్ఢా… ఒక్కసారిగా నేషనల్ పొలిటిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక త్వరలోనే మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చార్టర్డ్ అకౌంటెంట్‌ గా కెరీర్ ప్రారంభించి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువు పూర్తిచేసిన చడ్ఢా… చాలా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, 33 ఏళ్లకే రాజ్యసభలో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. పంజాబ్‌ లో ఆప్ విజయానికి కీలక పాత్ర పోషించిన ఆయన, పార్టీ డిప్యూటీ లీడర్‌గా కూడా పనిచేశారు. అయితే ఇటీవల అదే పార్టీలో ఎదురైన అవమానాలు, పదవి తొలగింపు వంటి పరిణామాలు ఆయన దిశ మార్చడానికి కారణమయ్యాయని సమాచారం.

Advertisement

అయితే లేని పోని అబద్ధాలను పదేపదే చెబుతూ నన్ను టార్గెట్ చేస్తున్నారు” అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. “నేను నిర్మించిన పార్టీ సిద్ధాంతాలు వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారుతోంది” అంటూ ఆప్ నేతృత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఇక రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2/3 వంతు సభ్యులు విడిపోతే అనర్హత వర్తించదు. ఈ లూప్‌హోల్‌ను ఉపయోగించుకున్న చడ్ఢా… సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్‌భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ, స్వాతి మలివాల్ వంటి ఎంపీలను తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఈ ఏడుగురి సంతకాలతో కూడిన లేఖ రాజ్యసభ ఛైర్మన్ వద్ద ఉండగా… ఆప్ రాజ్యసభ బలం బీజేపీ వైపు మళ్లినట్టే కనిపిస్తోంది. మొత్తం మీద… ఈ పరిణామం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement