Advertisement

Tech Mahindra : హైదరాబాద్‌ టెక్ మహీంద్రా లో భారీ వాక్‌ ఇన్ డ్రైవ్

Tech Mahindra హైదరాబాద్‌లో భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహించనుంది. ఏప్రిల్ 23 నుంచి 25 వరకు జరిగే ఈ రిక్రూట్‌మెంట్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 100 ఖాళీలు ఉండగా, ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌ఎస్‌సీ, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అందరూ అర్హులు.

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ బహదూర్‌పల్లి లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అంతర్జాతీయ కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్‌ను హ్యాండిల్ చేయడం, వారి సమస్యలను అర్థం చేసుకుని సమర్థవంతంగా పరిష్కరించడం వంటి బాధ్యతలు ఉంటాయి. ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. అలాగే యూకే టైమింగ్ ప్రకారం నైట్ షిఫ్ట్స్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. రెగ్యులర్ ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్న వారు అర్హులు కారు.

Advertisement

జీతభత్యాల విషయానికి వస్తే, ఫ్రెషర్స్‌కు రూ.2.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు, అనుభవం ఉన్న వారికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం ఇవ్వనున్నారు. ఎంపిక ప్రక్రియలో హెచ్‌ఆర్, వీఎన్‌ఏ, ఆపరేషన్స్ రౌండ్స్ ఉంటాయి. ఎంపికైన వారికి క్యాబ్ సదుపాయం, గ్రోత్ అవకాశాలు వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్‌పై “Akhil” అనే పేరు తప్పనిసరిగా పేర్కొని వాక్‌ఇన్‌కు హాజరు కావాలని కంపెనీ సూచించింది.

Advertisement