మన పత్రిక, మిర్యాలగూడ: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కేఎల్‌ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాల విద్యార్థి కె.చరణ్ ఆల్ ఇండియా 351 ర్యాంక్ సాధించి టాప్ ఎన్‌ఐటీలో సీటు సాధించనున్నారు.
అదేవిధంగా మరో విద్యార్థి శివ చరణ్ 7577 ర్యాంకును సొంతం చేసుకున్నారు. వారితో పాటు అడ్వాన్స్‌కు సెలెక్ట్ అయిన వారిలో మౌనిక, అస్మ, చాణక్య, శ్రీవల్లి, మనస్విని, హేమలత ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా వరుస విజయాలు సాధిస్తున్న కేఎల్‌ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ఏడాది కూడా ప్రతిభ చాటి ఉత్తమ ర్యాంకులు సాధించారు.
ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ అభినందించారు. డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, పీఎల్‌ఎన్ రెడ్డి, హనుమంత రెడ్డి, చైతన్య ఆనంద్ తదితరులు విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రశంసలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
