మన పత్రిక, వెబ్‌డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ గడచిన వారం రోజులుగా చక్కటి రికవరీ సాధించింది. దీనికి తోడు దేశీయ మార్కెట్‌లో ఆభరణాల డిమాండ్ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపింది.
Advertisement
గత తొమ్మిది వారాలుగా పెరిగిన ధరలు ఈ వారం తగ్గుముఖం పట్టినా, ఇది కేవలం ‘టెక్నికల్ కరెక్షన్’ మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
