WhatsApp
Advertisement

2026 Bajaj Pulsar 125: ఎల్‌ఈడీ హెడ్‌లైట్, గ్రాఫిక్స్‌తో అదుర్స్.. త్వరలోనే లాంచ్!

మన పత్రిక వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో యువత నుంచి ఉద్యోగుల వరకు బజాజ్ పల్సర్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన బైక్‌గా పేరొందిన ‘పల్సర్ 125’ను బజాజ్ ఆటో సరికొత్త హంగులతో తీసుకువస్తోంది. 2026 మోడల్‌గా రాబోతున్న ఈ బైక్, పాత క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే ఆధునిక ఫీచర్లతో ముస్తాబైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్‌లు షోరూమ్‌లకు చేరుతుండటం విశేషం.

కీలక మార్పులు ఇవే.. ఇప్పటికే పల్సర్ 150ని అప్‌డేట్ చేసిన కంపెనీ, ఇప్పుడు 125సీసీ వెర్షన్‌లోనూ భారీ మార్పులు చేసింది.

Advertisement
  • ఎల్‌ఈడీ లైటింగ్: ఈ కొత్త మోడల్‌లో ప్రధాన ఆకర్షణ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్. 125సీసీ సెగ్మెంట్‌లో తొలిసారిగా దీనిని పరిచయం చేస్తున్నారు. అలాగే ఇండికేటర్లను కూడా ఎల్‌ఈడీలుగా మార్చడంతో బైక్ ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది. అయితే, పల్సర్ బ్రాండ్‌కు ఐకానిక్‌గా నిలిచిన వెనుక వైపు టెయిల్ ల్యాంప్‌లో మాత్రం మార్పులు చేయలేదు.
  • కొత్త గ్రాఫిక్స్: ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, ఇంజిన్ కౌల్‌పై సరికొత్త గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. దీనివల్ల బైక్ ఫ్రెష్‌గా కనిపిస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్ 125 ధర సుమారు రూ. 82 వేలు (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త ఫీచర్లు, ఎల్‌ఈడీ అప్‌డేట్స్ కారణంగా 2026 మోడల్ ధర కొంచెం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ బైక్ కోరుకునే వారికి, ఆఫీస్ అవసరాలకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. త్వరలోనే కంపెనీ అధికారిక ప్రకటన చేయనుంది.

Advertisement