మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరం (FY27)లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, అలాగే ట్రూఅప్ రూపంలో ప్రజలపై అదనపు భారం వేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిస్కమ్‌లకు ఏర్పడే ₹15,790 కోట్ల రెవెన్యూ లోటును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్సీ (APERC)కి లేఖ రాసింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ప్రకటించిన విధంగానే 22 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు, మరో 22 లక్షల ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్తు పథకాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇక వాణిజ్య వినియోగదారులకు సైతం భారీ ఉపశమనం కలిగిస్తూ, యూనిట్ ధరను ₹12.25 నుంచి ₹9.95కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
