Advertisement

ఏపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: వైఎస్ జగన్ డిమాండ్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ (YCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీలో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుందని జగన్ పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సమగ్రంగా సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

Advertisement
Advertisement