Betting Loss : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ లో లక్షలు పెట్టి లాస్ అయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల అఖిల్ బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు.
కానీ, సంగారెడ్డిలోనే ఓ హోటల్ లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, అప్పులు చేసి బెట్టింగ్ లో పెట్టానని, అప్పు ఇచ్చిన వాళ్లు తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయాడు. దీంతో ముందు ఇంటికి రా. ఇంటికి వచ్చాక అన్ని మాట్లాడుకుందాం. బాధపడొద్దు.. అని అఖిల్ తండ్రి సముదాయించాడు.
ఆ తర్వాత అఖిల్ హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఉన్న యువకుడు ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా, అఖిల్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
