Dr Umar Mohammad : ప్రస్తుతం దేశమంతా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ గురించే మాట్లాడుకుంటోంది. ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ మహమ్మద్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబు పేలిన కారులో ఉన్నది ఇతడే అని పోలీసులు నిర్ధారించారు. అతడు ఒక సూసైడ్ బాంబర్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే కారులో ఉండి బాంబు పేలేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
ఉమర్ ది పుల్వామా దగ్గర్లోని కోయిల్ అనే ఊరు. ఇతడు డాక్టర్ కూడా. ప్రస్తుతం అతడు ఫరీదాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జమ్ముకశ్మీర్ లో టెర్రర్ ఆపరేషన్ ను పోలీసులు నిర్వహించారు. అప్పుడు కొందరు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా ఉమర్ తో కలిసి ఫరీదాబాద్ లో మెడికల్ కాలేజీలో పని చేసిన వారే. వాళ్లతో ఉమర్ కు సంబంధాలు కూడా ఉన్నాయి. తన గురించి కూడా తెలుసుకొని పోలీసులు వచ్చి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతోనే తను ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసలు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
