Telangana Local body elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దయింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను సుప్రీం కూడా కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి.. అని సుప్రీం ఆదేశించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉన్నప్పుడు సర్వే ఎందుకు చేశారఉ. అసలు చట్టం చేయకుండా జీవో ఇలా ఇచ్చారు? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తాజాగా తెలంగాణ హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని, ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. దీంతో ఓ రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. విచారణను రెండు వారాలకు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

