Advertisement

దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు ఆధిపత్యం

మన పత్రిక, విశాఖపట్నం: దేశంలో జరిగే సముద్ర ఆహార (సీఫుడ్) ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో సింహభాగం విశాఖ పోర్టు ద్వారానే జరుగుతోంది.

2025 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు నుంచి ఏకంగా 50.87 శాతం వాటా నమోదైంది. అలాగే 2026లోనూ 48.89 శాతం వాటాతో ఈ పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఒక ఏడాది కాలంలోనే విశాఖ పోర్టు ద్వారా జరిగిన సీఫుడ్ ఎగుమతులు 29.67 శాతం చొప్పున వృద్ధి చెందాయి.

Advertisement

ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ఓడీఓపీ (ODOP) పథకాన్ని అమలు చేయడంలోనూ విశాఖపట్నం పోర్టు కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో మొత్తం 99 రకాల ఓడీఓపీ ఉత్పత్తులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది.

Advertisement