Advertisement

విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ జీరో

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయింగ్ సంఖ్య ప్రస్తుతం సున్నాగా ఉంది. ఆయన ఈ సామాజిక మాధ్యమంలో రష్మిక మందన్నతో సహా ఏ ఇతర ఖాతానూ ఫాలో కావడం లేదు. మరోవైపు రష్మిక మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండను ఫాలో అవుతూనే ఉంది.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు

విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ లిస్ట్ సున్నాగా మారడంతో వీరిద్దరి సంబంధంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షురూ అయ్యాయి. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం కేవలం ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ ఆధారంగా వ్యక్తిగత విషయాలపై ముగింపునకు రాకూడదని స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement