హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) , హీరోయిన్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) శుక్రవారం నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో ఉదయం 11 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
‘గీత గోవిందం’ సినిమాతో వారి మధ్య ప్రేమ మొదలైందని గాసిప్స్ వచ్చినప్పటికీ, ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. కానీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఫొటోలు వైరల్ అయ్యేవి. ఇప్పుడు నిశ్చితార్థం అధికారికంగా జరిగింది — ఎలాంటి హంగామా లేకుండా.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
