రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ రాలేదు. రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. దిల్ రాజు (Dil raju) ప్రొడక్షన్ లో చేస్తున్న రౌడీ జనార్ధన( Rowdy Janardhana) సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. కాగా తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా అనౌన్స్ అయింది.
అందిన వివరాల ప్రకారం విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) భారీ బడ్జెట్ తో ఓ క్రేజీ సినిమా నిర్మిస్తున్నారు. అలాగే టి సిరీస్ వారు కూడా నిర్మాణంలో భాగం కానున్నారు. ఇక ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ , ఇంకా గ్లింప్స్ ను గణతంత్ర దినోత్సవం రోజున (January 26th) విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తుంటే బహుశా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని అనుకోవచ్చు.
మరి ఈ సినిమాతోనైనా విజయ్ దేవరకొండ ఆశించిన బ్లాక్ బస్టర్ దొరుకుతుందేమో చూడాలి. అయితే ఈ సినిమా 2027 లో విడుదల అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే దీనికంటే ముందు రౌడీ జనార్ధన రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
