మన పత్రిక, వెల్దండ: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత కోసం ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టాస్క్ సిఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు.
గ్రామీణ యువకుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక అడ్డంకుల వల్ల ఏ ఒక్కరూ తమ ఉద్యోగ సాధనలో ఆగిపోకూడదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ అకాడమీలకు దీటుగా, అనుభవజ్ఞులైన అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఇక్కడ శిక్షణా తరగతులు అందిస్తున్నట్లు వివరించారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉచిత అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని రాఘవేందర్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
