Advertisement

వారణాసి డిజిటల్ హక్కుల కొనుగోలుకు నెట్‌ఫ్లిక్స్ పోటీ?

సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఈ సినిమా డిజిటల్ హక్కుల విలువ రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకోవడానికి నిర్మాతులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఒప్పందంపై నెట్‌ఫ్లిక్స్ గానీ, చిత్ర నిర్మాణ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

విడుదల తేదీలో మార్పులు ఉండేనా?

గతంలో ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అయితే భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఎక్కువగా ఉండటంతో సినిమా విడుదలను 2027 జూలై లేదా ఆగస్టు నెలకు వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి 2027 ఏప్రిల్ 7నే అధికారిక విడుదల తేదీగా ఉంది.

Advertisement