మన పత్రిక, వెబ్‌డెస్క్: అవినాష్ తిరువీధుల కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘వనవీర’. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, నందు ప్రతినాయకుడి పాత్రలో వైవిధ్యంగా కనిపించనున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటుడు హర్ష, బాబీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
