టాలీవుడ్ (Tollywood) లో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వార్ మహా గొప్పగా ఉంటుందని కొన్ని నెలల కింద ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ వరుస బెట్టి పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడి పూర్తిగా సమ్మర్ రేస్ నుండి వైదొలగగా, మీడియం రేంజ్ మూవీస్ కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన డెకాయిట్ ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేయగా, ఇప్పుడు మళ్ళీ థియేటర్లు వెలవెలబోయాయి. లాస్ట్ వీక్ విడుదలైన సినిమాలు అంతగా సందడి చేయలేకపోయాయి. కాగా ఈ వారం కూడా పెద్దగా సినిమాల రిలీజ్ లు లేకపోగా ఓ మలయాళ డబ్ సినిమా మాత్రం తెలుగులో రిలీజ్ కి రెడీ అయింది.
మలయాళంలో రీసెంట్ గా బ్లాక్‌బస్టర్ అయిన ‘వాలా 2’ (Vaazha 2) టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతుంది. ఇప్పటికే మలయాళం లో 150 కోట్లకి పైగా వసూలు చేసి, సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు తెలుగులో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమాను నిర్మాత సాహు గారపాటి (Sahoo Garapati) తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ వారం ఈ సినిమాకి పోటీగా పెద్దగా ఏ క్రేజీ సినిమాలు లేవు. తెలుగు సినిమా గేదెల రాజు (gedela raju) అని ఒకటి రిలీజ్ అవుతుండగా, వాలా 2 తో పోలిస్తే ఏమాత్రం బజ్ ఆ సినిమాకు లేదు. అందువల్ల ‘వాలా ‘2 కి ఈ వారం తెలుగులో ఏ అడ్డు లేదని చెప్పాలి.
తెలుగు ఆడియన్స్ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాకు కనెక్ట్ అయితే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
