WhatsApp
Advertisement

US Cargo Plance Crash : కుప్పకూలిన కార్గో విమానం

US Cargo Plance Crash : యూఎస్‌లో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటన కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ కు సమీపంలో చోటు చేసుకుంది. లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు.

ఒక్కసారిగా రన్ వేను తాకి విమానం కుప్పకూలడంతో విమానానికి వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత విమానం భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement