మన పత్రిక, వెబ్‌డెస్క్ : దుబ్బాకలో ( DUBBAKA ) యూరియా టోకెన్ల పంపిణీ విషయంలో ఏఈఓ సంతోష్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా ( UREA ) రాగానే రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వినాయక చవితి పండుగ ఉన్నా, వర్షం కురుస్తున్నా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు గొడుగులు పట్టుకొని నిలబడ్డారు.
కానీ ఏఈఓ సంతోష్ తనకు నచ్చిన వారికి మాత్రమే అదనపు టోకెన్లు ఇచ్చాడు. ముందస్తుగా 40 నుండి 50 బ్యాగులకు సంబంధించిన టోకెన్లు తన అనుచరులకు అందించాడు. దీంతో ఉదయం నుంచి వర్షంలో నిలబడిన చాలామంది రైతులకు యూరియా లభించలేదు. ఈ అన్యాయమైన పంపిణీ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండుగ, వర్షం అనే లెక్కలు చూడకుండా క్యూలో నిలబడినా ప్రయోజనం లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
