టాలీవుడ్ లో ఈ ఇయర్ రాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీస్ లో “పెద్ది”(Peddi) ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, చికిరి సాంగ్ (Chikiri song) సహా ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా బుచ్చిబాబు బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ ఒక చిన్న మేకింగ్ వీడియో బిట్ ని బుచ్చిబాబు పైన రిలీజ్ చేసారు. ఈ వీడియోతో బుచ్చిబాబు (Buchibabu) డైరెక్షన్ మేకింగ్ ఎలా ఉంటుందో, సినిమా కోసం తనెంత శ్రమిస్తున్నాడో తెలుస్తుంది.
అయితే ఈ వీడియోలో కొన్ని సినిమాలో ఉన్న సెట్స్ సహా, ఇతర నటీనటులు కూడా కనబడడం జరిగింది. ఈ వీడియోతో పెద్దిలో మరో క్రేజీ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది. పెద్దిలో ఓ సీన్ ని రైల్వే స్టేషన్ లో చిత్రీకరిస్తున్న స్టిల్ కనిపించగా, ఆ స్టిల్ లో అనిమల్ ఫేమ్ (మరాఠి నటుడు) ‘ఉపేందర్ లిమాయె’ (Upendra limaye) కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ నటుడు మరాఠీ లో మంచి పేరున్న నటుడు కాగా, అనిమల్ తో ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన ఇతను తెలుగులో ఇప్పటికే ఓజి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో కనిపించాడు. ఇక ఇప్పుడు ‘పెద్ది’ లో కూడా కీ రోల్ లో నటిస్తుండడంతో పెద్ది క్రేజ్ కి మరింత హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.
ఇక పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, శివ రాజ్ కుమార్, దివ్యెందు శర్మ, వంటి స్టార్ నటులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. నిజానికి మార్చి 27న రిలీజ్ కావాల్సిన పెద్ది ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇక పెద్ది నుండి ఫిబ్రవరి మూడో వారంలో సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
