బిగ్ బాస్ సీజన్ 9 ఆరో వారం రసవత్తరంగా సాగుతుంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఎవరికీ వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో సరి కొత్త మలుపు జరిగింది. బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి అని చెప్పొచ్చు.
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లకు అవకాశం ఇవ్వగా, వారితో పాటు హౌస్మెట్ లలో ఐదుగురికి అవకాశం కల్పించారు. అయితే వాళ్లలో వైల్డ్ కార్డు సభ్యులందరూ కలిసి ఒక్కొక్కరిగా పాత కంటెస్టెంట్లందరిని ఎలిమినేట్ చేయగా, చివరగా సుమన్ శెట్టి (Suman shetty) మిగిలాడు. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ మిగిలిన వాళ్ళని పార్టనర్స్ గా టాస్క్ పెట్టగా, ఆ టాస్క్ లో సుమన్ శెట్టి, గౌరవ్ గుప్త (Gourav Gupta) విజేతలయ్యారు.
ఫలితంగా వీళ్లిద్దరూ ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్లయ్యారు. అయితే వైల్డ్ కార్డు సభ్యుడైన నిఖిల్ నాయర్ కి బిగ్ బాస్ అవకాశం కల్పిస్తూ గౌరవ్ గుప్త తో కెప్టెన్సీ ఛాలెంజ్ కి అవకాశమిచ్చారు బిగ్ బాస్. అంటే వీళ్లిద్దరి మధ్యలో మరో టాస్క్ ఉంటుంది. సుమన్ శెట్టి కాకుండా వీళ్ళలో ఒకరు మరో కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అది ఈరోజు ఎపిసోడ్ లో గాని, రేపటి ఎపిసోడ్ లో గాని తెలుస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
